Today Horoscope:ఓ రాశివారు ఖర్చులకు తగ్గ ఆదాయం లేక ఇబ్బంది పడతారు

First Published Jun 14, 2024, 5:30 AM IST

Today Horoscope: ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..
 

telugu astrology

14-6-2024  శక్రవారం  మీ రాశి ఫలాలు


మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలకు వెళతారు. మీరు మొదలుపెట్టిన పనులను సకాలంలో పూర్తవడంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అవసరానికి బంధుమిత్రుల నుంచి సహాయం పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులు ఉత్సాహంగా పని చేస్తారు. 
 

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:- దగ్గరి బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఉద్యోగులు అనుకున్నవి నిజమవుతాయి. కొత్తవ్యాపారాలు లాభాల్లో కొనసాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది.

Latest Videos


telugu astrology


మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:- మీ మాటతీరుతో ఎంతో మందిని బాధపెడతారు. అధ్యాత్మిక చింతన పెరుగుతుంది.  అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి తెస్తారు. వ్యాపారులు నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. ఉద్యోగులకు అధికారుల వల్ల ఒత్తిడి కలుగుతుంది. పిల్లల ఆరోగ్యం మందగిస్తుంది. 

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-నిరుద్యోగులు శుభవార్త వింటారు. రాజకీయ నాయకుల సహాయం వల్ల కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.  కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు పెద్దగా లాభం ఉండవు. పెరుగుతుంది.

telugu astrology

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:- అడ్డులన్నింటినీ తొలగించి పనులను పూర్తిచేస్తారు.  బంధుమిత్రులతో వింధు, వినోదాల్లో పాల్గొంటారు. కొత్త వాహనం కొనే యోగం ఉంది. ఆర్థికంగా కాస్త మెరుగ్గా ఉంటారు. ఒకరి జోక్యంతో ఆస్థికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. 

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు చేస్తారు. ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. పాత అప్పుల బాధ పెరుగుతుంది. దీంతో మీరు కొత్త అప్పులను చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం మాత్రం తక్కువగానే ఉంటుంది.  వ్యాపారంలో గొడవలు అవుతాయి. 

telugu astrology


తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:-సమస్యలు, వివాదాలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు,  సూచనలు తీసుకోండి. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు.దూరపు బంధువులను కలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. 

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- ఈ రోజు ఎంతో ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి.  ఆదాయ మార్గాలు పెరుగుతాయి. క్రయ విక్రయాల్లో  మంచి లాభాలు పొందుతారు. ఒకరి సహాయంతో వివాదాలు తొలగిపోతాయి. 

telugu astrology


ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:- ముఖ్యమైన పనులు పూర్తికాక ఒత్తిడికి గురవుతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎంతో బాధపడతారు. చేతిలో ధనం నిలవక ఇబ్బందులు పడతారు. నిరుద్యోగులు మరిన్ని ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఇంట్లో గొడవలు జరుగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. 
 

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:-ఉద్యోగులకు తమ పనితనంతో పై అధికారుల ప్రశంసలు పొందుతారు. ఇంట్లో శుభకార్యాలు చేసే అవకాశం ఉంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. అకస్మత్తుగా ధనం పొందుతారు. వ్యాపారులు పెట్టుబడులను బాగా స్వీకరిస్తారు. చిన్ననాటి స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. 

telugu astrology


కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం:-గొడవలు, కొట్లాటలకు దూరంగా ఉండాలి. అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి బాగా ఎక్కువవుతుంది. మీ ప్రవర్తన వల్ల ఇతరులు  ఇబ్బంది పడతారు. ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. అధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. వ్యాపారంలో అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులకు ఈ రోజు భారంగా గడుస్తుంది. 

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-పనిభారం పెరుగుతుంది. డబ్బుకు సంబందించిన సమస్యలు వస్తాయి. ఆరోగ్యం బాగా తింటుంది. ఇతరుకుల ఏవిషయంలో నైనా మాట ఇచ్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. బంధు మిత్రులతో కలహాలు ఏర్పడతాయి.  ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. 

click me!