January Horoscope: జనవరి 2027లో ఐదు గ్రహాలు తమ స్థానాలను మార్చుకుంటాయి. ఈ గ్రహాల మార్పు కారణంగా కొత్త సంవత్సరంలో ఐదు రాశుల వారికి అద్భుతంగా ఉండనుంది. పట్టిందల్లా బంగారమే కానుంది.
జనవరి 2027లో బుధుడు, శుక్రుడు రెండుసార్లు తమ స్థానాలను మార్చుకోనున్నాయి. శుక్రుడు వృశ్చిక రాశిలోకి అడుగుపెడతాడు. మకర రాశిలోకి బుధుడు, సింహ రాశిలో కుజుడు వక్రగతిలో ఉంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. కర్కాటక రాశిలోకి గురుడు వక్రగతిలో ఉంటాడు. బుధుడు కుంభ రాశిలోకి వెళ్లగా,జనవరి చిరవలో శుక్రుడు మళ్లీ ధనస్సు రాశిలో వక్రగతిలోకి ప్రవేశిస్తాడు. ఈ గ్రహాల మార్పుల వల్ల లాభాలు పొందే రాశులు ఇవే..
26
కుంభ రాశి...
జనవరి 28న బుధుడు మీ లగ్నంలోకి ప్రవేశించడం వల్ల వృత్తి, ఆర్థిక రంగాల్లో సానుకూల మార్పులు కనిపిస్తాయి.
ఉద్యోగంలో పదోన్నతికి అవకాశాలు, పై అధికారుల నుంచి ప్రశంసలు లభించవచ్చు.
కొత్త పెట్టుబడులు, లాభదాయక ప్రాజెక్టుల వైపు అడుగులు వేసేందుకు ఇది అనుకూల సమయంగా నిలుస్తుంది.
36
మకర రాశి
జనవరి 10న బుధుడు మీ లగ్నంలోకి రావడంతో నిలిచిపోయిన పనులకు తిరిగి ఊపు వస్తుంది.
వ్యాపారంలో కొత్త ఒప్పందాలు, భాగస్వామ్యాలు, ఆస్తి లేదా భూమి సంబంధిత నిర్ణయాలకు ఇది మంచి సమయం.
విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది.