జ్యోతిష్య శాస్త్రంలో కుజ శుక్ర సంయోగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దాదాపు 18 ఏళ్ల తర్వాత కుజుడు శుక్రుడు వృశ్చిక రాశిలో సంయోగం చెందుతున్నారు. కుజుడు శక్తికి, ధైర్యానికి, బలానికి, కోపానికి, సంపదకు సూచిక. ఇక శుక్రుడు అందానికి, ఆనందానికి, సంపదకు, శ్రేయస్సుకు కారణంగా చెబుతారు. కుజుడు నవంబర్లో వృశ్చిక రాశిలోకి ప్రవేశించి శుక్రుడితో కలిసి బలమైన యోగం ఏర్పడుతోంది.