Guru Planet Transit: గురుగ్రహ సంచారం.. ఈ 3 రాశులవారికి డబ్బే డబ్బు !

Published : Apr 11, 2025, 10:03 PM IST

Guru Planet Transit 2025 Effect On Zodiac: బృహస్పతి గ్రహం (గురు గ్రహం) 2025లో మృగశిర నక్షత్రం లోకి ప్రవేశించాడు. ఇది జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రత్యేకమైన సంఘటన. మృగశిర నక్షత్రంలోకి గురు గ్రహం సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అనేక లాభాలు, సానుకూల పరిస్థితులు రావడంతో పాటు వారికి లక్ కూడా కలిసి వస్తుంది.   

PREV
14
Guru Planet Transit: గురుగ్రహ సంచారం..  ఈ 3 రాశులవారికి డబ్బే డబ్బు !
Guru Planet Transit Effects : Unexpected happiness and wealth will come to these 3 zodiac signs

Guru Planet Transit Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో దేవతల గురువు అయిన బృహస్పతి (గురుగ్రహం) సానుకూల ఫలితాలను కలిగించే శక్తివంతమైన గ్రహంగా నమ్ముతారు. 2025లో గురుగ్రహం మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించింది.

దీంతో కొన్ని రాశులవారి జీవితాల్లో అనేక మార్పులు జరగనున్నాయి. అనుకోని విధంగా మంచి శుభఫలితాలు అందుతాయి. గుడ్ లక్ తో పాటు మనీ కూడా వచ్చిచేరుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వృశ్చిక, సింహ, తుల రాశులవారి లైఫ్ లో సానుకూల మార్పులు వస్తాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

24
Guru Planet Transit 2025 Effects : Unexpected happiness and wealth will come to these 3 zodiac signs

వృశ్చిక రాశి:

వ్యక్తిగత జీవితంలో శాంతి, ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. వృశ్చిక రాశివారికి గురుగ్రహం అనేక అనుకూలతలను తీసుకురానుంది. ముఖ్యంగా గృహ జీవితం ప్రశాంతంగా మారుతుంది. భార్యాభర్తల మధ్య తలెత్తిన సమస్యలు తొలగిపోతాయి. దీర్ఘకాలంగా ఉన్న వ్యాపార సమస్యలు పరిష్కారమవుతాయి. పెట్టుబడుల వల్ల లాభాలు వస్తాయి. మానసిక శాంతి లభిస్తుంది.

34
Guru Planet Transit Effects

సింహ రాశి:

ఆదాయాల్లో మార్పులు, ఉద్యోగ ప్రమోషన్లు చూస్తారు. సింహరాశివారికి ఈ కాలంలో ఆర్థికంగా ఊహించని మార్పులు కనిపిస్తాయి. ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్లు, ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారాల్లో లాభాలు అధికంగా ఉంటాయి. పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి  ఈ సమయం  సువర్ణావకాశంగా చెప్పవచ్చు.

44
Guru Planet Transit Effects : happiness and wealth will come to these 3 zodiac signs

తుల రాశి:

విద్య, విదేశీ అవకాశాల్లో విజయాలు అందుకుంటారు. తులరాశివారికి మృగశిర నక్షత్రంలోకి గురు గ్రహం ప్రవేశించడం వల్ల విద్యలో సానుకూలత, విదేశీ ప్రయాణాల అవకాశాలు, పోటీ పరీక్షల్లో విజయాలు లభిస్తాయి. విద్యార్థులకు ఇది ఉత్తమమైన సమయంగా జ్యోతిష్యులు చెబుతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories