మనిషి గా పుట్టిన తర్వాత సమస్యలు లేకుండా ఉంటాయా? ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ సమస్యలను తగ్గించుకోవడానికి మనమంతా ఏవేవో చేస్తూ ఉంటాం. కానీ, మనకు వచ్చే సమస్యలకు మన పుట్టిన తేదీని బట్టే పరిష్కారాలు ఉంటాయని మీకు తెలుసా? న్యూమరాలజీ ప్రకారం మీరు పుట్టిన తేదీని ఆధారంగా చేసుకొని మీరు ఏం చేస్తే.. మీ సమస్యలన్నీ తీరిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం...
నెంబర్ 1
ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో మీరు జన్మించినట్లయితే న్యూమరాలజీ ప్రకారం మీ నెంబర్ 1 కిందకు వస్తుంది. ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు స్వతహాగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎలా వెళ్లాలి? విజయం ఎలా సాధించాలని అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో మీకు కొన్ని అడ్డంకులు కూడా ఏర్పడొచ్చు. ఆ అడ్డంకులు తీరి, విజయం సాధించాలి అంటే ఈ తేదీల్లో జన్మించిన వారు ప్రతిరోజూ ఒక రాగిపాత్రలో నీటిని తీసుకొని సూర్యుడికి సమర్పించాలి. ఇలా రోజూ చేయడం వల్ల వీరు సక్సెస్ అవ్వగలరు.
నెంబర్ 2..
ఏ నెలలో అయినా 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 2 కిందకు వస్తారు. ఈ తేదీల్లో జన్మించినవారు వారి జీవితంలో ఉన్న సమస్యలు తగ్గిపోవాలంటే.. ప్రతిరోజూ శివలింగానికి జలాభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో ప్రశాంతత మాత్రమే కాదు, అనుకున్న విజయం కూడా సాధించగలరు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లే సమయంలో తల్లి ఆశీర్వాదం కచ్చితంగా తీసుకోవాలి.
నెంబర్ 3..
ఏ నెలలో అయినా 3, 12, 21,30 తేదీల్లో జన్మించిన వారు తమ సమస్యలు తీరాలన్నా, ఆనందంగా ఉండాలన్నా కేవలం ఒక మంత్రం జపిస్తే చాలు.
ప్రతిరోజూ "ఓం నమో భగవతే వాసుదేవాయ నమః" అనే మంత్రాన్ని జపిస్తే చాలు. వారి సమస్యలన్నీ తీరిపోతాయి.
నెంబర్ 4..
4, 13, 22 , 31 తేదీలలో జన్మించిన వారు ప్రతిరోజూ దుర్గా చాలీసా చదవాలి. ఇలా చదవడం వల్ల వారి జీవితంలో సంతోషం లభిస్తుంది. జీవితంలో ఎదురయ్యే చాలా సవాళ్ల నుంచి వారు బయటపడతారు. దుర్గా దేవి ఆశీర్వాదం లభిస్తుంది.
నెంబర్ 5..
5, 14, 23 తేదీలలో జన్మించిన వారికి "ఓం గణగణపతయే నమః" అనే మంత్రం ప్రతిరోజూ చదవాలి. ప్రతిరోజూ ఆవుకు పచ్చి మేత కూడా అందించాలి. ఇలా చేయడం వల్ల అదృష్టం వరిస్తుంది.
నెంబర్ 6..
6, 15, 24 తేదీలలో జన్మించిన వారు లక్ష్మీదేవి మంత్రాలను జపించడం మంచిది. ప్రతి శుక్రవారం లక్ష్మీ దేవిని గులాబీ పూలతో పూజించడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి.
నెంబర్ 7..
7, 16, 25 తేదీలలో జన్మించిన వారు ప్రతి రోజూ 10 నుండి 15 నిమిషాలు మాత్రమే క్రమం తప్పకుండా ధ్యానం చేయడం మంచిది.వీధి కుక్కలకు ఆహారం ఇవ్వడం లాంటివి చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది.
నెంబర్ 8..
8, 17, 26 తేదీలలో జన్మించిన పురుషులు, మహిళలు హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు, ఇది ధైర్యాన్ని బలాన్ని పెంచుతుంది. అంతేకాకుండా,వీలైనంత వరకు ఇతరులకు సహాయం అందించాలి.
నెంబర్ 9..
9, 18, 27 తేదీలలో జన్మించిన వారు ప్రతిరోజూ హనుమాన్ చాలీసా చదవాలి. తరచుగా రామ నామాన్ని జపించడం వల్ల అపారమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. చాలా రకాల సమస్యలు కూడా తీరిపోతాయి.