Hanuman Jayanti: హనుమయ్య ఆశీస్సులు ఈ ఐదు రాశులకే..!
ఈ ఏడాది హనుమాన్ జయంతి ఏప్రిల్ 12వ తేదీన వస్తోంది. ఈ రోజున జోతిష్యశాస్త్రం ప్రకారం రాజయోగం ఏర్పడనుంది. ముఖ్యంగా హనుమయ్య ఆశీస్సులు ఐదు రాశులపై ఉంది. వారికి అదృష్టం కలిసిరానుంది.
ఈ ఏడాది హనుమాన్ జయంతి ఏప్రిల్ 12వ తేదీన వస్తోంది. ఈ రోజున జోతిష్యశాస్త్రం ప్రకారం రాజయోగం ఏర్పడనుంది. ముఖ్యంగా హనుమయ్య ఆశీస్సులు ఐదు రాశులపై ఉంది. వారికి అదృష్టం కలిసిరానుంది.
హిందువులకు హనుమాన్ జయంతి చాలా ప్రత్యేకం. చైత్ర మాసంలో వచ్చే చివరి పౌర్ణమి రోజున ఈ హనుమాన్ జయంతి ని జరుపుకుంటారు. ఈ ఏడాది మాత్రం రెండు రానున్నాయి. ఒకటి ఏప్రిల్ 12వ తేదీ కాగా, మరొకటి డిసెంబర్ లో రానుంది. ఇప్పుడు వచ్చే హనుమాన్ జయంతి మాత్రం ఐదు రాశులకు ఐశ్వర్యాన్ని తేనుంది. మరి, అంజనీ పుత్రుడి దయ ఏ రాశి వారిపై ఎక్కువగా ఉందో, ఏ విధంగా కలిసి రానుందో తెలుసుకుందాం..
1.మేష రాశి..
మేష రాశివారికి ఏప్రిల్ 12వ తేదీన వచ్చే హనుమాన్ జయంతి చాలా ముఖ్యం. ఈ రోజున మేష రాశివారు జీవితంలో చాలా విజయాలు సాధిస్తారు. వారు చేసే ప్రతి పనిలో ఎవరో ఒకరు సహాయం చేస్తారు. దాని వల్ల వారు సులభంగా ఆ పని పూర్తి చేయగలరు. శుభ వార్తలు వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంది.
2.సింహ రాశి..
సింహ రాశి వారికి ఈ సంవత్సరం హనుమాన్ జయంతి అదృష్టాన్ని తెస్తుంది. ఈ రోజు వృత్తి జీవితానికి ముఖ్యం. తీసుకునే నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆంజనేయుని దయతో వారి జీవితం ఆనందంగా మారుతుంది.
3.కన్య రాశి..
హనుమాన్ జయంతి రోజు కన్య రాశి వారికి మంచి జరుగుతుంది. ఈ రాశి వారు కొన్ని కొత్త ఉద్యోగ ప్రతిపాదనలు పొందుతారు. ఆఫీసులో గౌరవం పెరుగుతుంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు.వ్యాపారస్తులకు కూడా ఈ రోజు బాగా కలిసొస్తుంది.
4.ధనస్సు రాశి..
శనివారం నాడు వచ్చే హనుమాన్ జయంతి ధనుస్సు రాశి వారికి ఆర్థికంగా కలిసొస్తుంది. ఊహించని విధంగా డబ్బులు వచ్చే అవకాశం ఉంది. లక్ష్మీదేవి దయ ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఈ రాశి వారికి ఊదా రంగు కలిసి వస్తుంది.
5.కుంభ రాశి..
కుంభ రాశి వారికి ఈ సంవత్సరం హనుమాన్ జయంతి చాలా ముఖ్యం. డబ్బులు బాగా వస్తాయి. ఏదైనా పెద్ద పనిలో అవకాశం వస్తుంది. ఆకుపచ్చ రంగు ఈ రాశి వారికి కలిసి వస్తుంది.