సింహ రాశి వారికి గురు వక్రచలనం ఈ రాశికి మేలు చేస్తుంది. జీవితంలో పురోగతి ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో శాంతి, కెరీర్‌లో మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక లాభాల సూచనలు కనిపిస్తున్నాయి.
తుల రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉండొచ్చు. భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంపత్య జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది.
గమనిక: పైన తెలిపిన విషయాలు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం, జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ఆధారంగా అందించడమైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.