సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా రొమాంటిక్ గా ఉంటారట. వారి లైఫ్ పాట్నర్ కి సంబంధించిన ప్రతి విషయంపై వీరు శ్రద్ధ వహిస్తారట. వారికోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారట. మరి ఏ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఇలా ఉంటారో చూద్దాం.
సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారి మూల సంఖ్య 4. ఇది రాహువుకు సంబంధించిన సంఖ్య. మూలసంఖ్య 4 ను చాలా రహస్యమైనది, గంభీరమైనదిగా భావిస్తారు.
రాహువు ప్రభావంతో ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా తెలివిగా ఉంటారు. స్వతంత్రంగా ఉంటారు. అంతేకాదు ఈ సంఖ్య అతీంద్రియ శక్తులకు అధిపతి. ఆ కారణంగా వీరు ఆధ్యాత్మిక విషయాలపై ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారు.
24
ఈ తేదీల్లో పుట్టినవారికి కోపం ఎక్కువ..
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు సాధారణంగా చాలా మంచివారు. కానీ వీరికి కోపం చాలా ఎక్కువ. కొన్నిసార్లు వారి కోపం ఇబ్బందులకు దారితీస్తుంది. కొన్నిసార్లు వారు చాలా చిన్న విషయాలకు కూడా కోపం తెచ్చుకుంటారు. దానివల్ల ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది.
34
వీరి ప్రేమ జీవితం ఎలా ఉంటుందంటే?
మూలసంఖ్య 4 కలిగిన అమ్మాయిలు.. చాలా రొమాంటిక్ గా ఉంటారు. వీరు తమ భాగస్వామిని చాలా ప్రేమిస్తారు. వారు తమ భాగస్వామికి సంబంధించిన ప్రతి చిన్న విషయం గురించి శ్రద్ధ వహిస్తారు. వారి అవసరాలను తీర్చడానికి, వారు కోరిన పనిని చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎవరైనా వీరిని మోసం చేస్తే మాత్రం.. అస్సలు సహించరు.
సంఖ్యా శాస్త్రం ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగి ఉంటారు. వారి కృషి ఆధారంగా వృత్తి జీవితంలో మంచి విజయాన్ని సాధిస్తారు. వారు తమ పనిని అంకితభావంతో చేస్తారు. ఈ తేదీల్లో పుట్టినవారు తమ లక్ష్యాలను సాధించడానికి చాలా కష్టపడతారు.