Gaja Kesari Rajayogam: కర్కాటక రాశిలో గజకేసరి రాజయోగం.. ఈ 4 రాశులవారి తలరాత మారడం పక్కా!

Published : May 16, 2026, 02:29 PM IST

Gaja Kesari Rajayogam: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం త్వరలో కర్కాటక రాశిలో గురు, చంద్రుల కలయికతో గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. ఇది చాలా శక్తివంతమైన యోగం. దీనివల్ల కొన్ని రాశుల వారికి సంపద, పదవి, వృత్తిలో పురోగతి ఉంటాయి. ఆ రాశులేవో చూద్దాం.

PREV
15
గజకేసరి రాజయోగం

జ్యోతిష్య శాస్త్రంలో గజకేసరి రాజయోగాన్ని చాలా శక్తివంతమైన, అదృష్ట యోగంగా పరిగణిస్తారు. జూలై 14న కర్కాటక రాశిలో గురు, చంద్రుల కలయికతో ఈ రాజయోగం ఏర్పడబోతోంది. ఈ యోగం ప్రభావం అన్ని రాశులపై ఉన్నప్పటికీ, కొన్ని రాశుల వారికి మాత్రం ఇది జీవితాన్ని మార్చేంత ప్రయోజనాలు ఇస్తుంది. ముఖ్యంగా సంపద, పదవి, వృత్తిపరమైన పురోగతి వంటి విషయాల్లో పెద్ద మార్పులు కనిపిస్తాయి. మరి ఆ రాశులేవో తెలుసుకుందామా…

25
మేష రాశి

మేష రాశి వారికి ఈ గజకేసరి రాజయోగం అదృష్టాన్ని తీసుకువస్తుంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది. వృత్తిలో పురోగతితో పాటు, డబ్బు రాక కూడా పెరగవచ్చు. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్ లేదా కొత్త అవకాశాలు లభించవచ్చు. ఎన్నో ఏళ్లుగా మనసులో ఉన్న కలలు, కోరికలు ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. 

35
వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ యోగం గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది. చాలా కాలంగా ఉన్న సమస్యలు నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశం లభిస్తుంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నత పదవులు లేదా జీతం పెంపు లభించవచ్చు. ఆదాయం పెరిగి, ఆర్థికంగా పురోగతి సాధించే అవకాశం ఉంది. 

45
కన్య రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్య రాశివారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వీరి జీవితంలో శాంతి, సానుకూల మార్పులు ఉంటాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. వ్యాపారంలో పెద్ద ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం, స్థిరత్వం పెరిగే అవకాశం ఉంది.

55
తుల రాశి

గజకేసరి రాజయోగం తుల రాశి వారికి శుభ ఫలితాలను అందించనుంది. ఈ సమయంలో ఉద్యోగులకు మంచి అవకాశాలు లభించవచ్చు. పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారాలలో కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశముంది. పెట్టుబడుల ద్వారా లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో ఆనందం నెలకొంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. 

Read more Photos on
click me!

Recommended Stories