జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గజకేసరి రాజయోగం అత్యంత శుభప్రదమైంది. చంద్రుడు, గురువు ఒకే రాశిలో లేదా పరస్పర కేంద్ర స్థానాల్లో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. చంద్రుడు మనసుకు, భావోద్వేగాలకు సూచిక కాగా, గురువు.. జ్ఞానం, ధనం, ధర్మం, అదృష్టానికి కారకుడు. ఈ రెండు శుభ గ్రహాలు నేడు(జనవరి 2- శుక్రవారం) కలవడం వల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో గౌరవం, ఆర్థిక స్థిరత్వం, మంచి పేరు, అవకాశాలు పెరుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. గజకేసరి రాజయోగం వల్ల లబ్ధి పొందే రాశులేవో ఇక్కడ చూద్దాం.