Gajakesari Rajayogam: మరో నాలుగు రోజుల్లో గజకేసరి రాజయోగం.. ఈ 3 రాశులకు పండగే

Published : Dec 29, 2025, 01:48 PM IST

Gajakesari Rajayogam: కొత్త ఏడాది కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది.   కొత్త సంవత్సరంలో అత్యంత శుభప్రదమైన, ప్రభావవంతమైన రాజయోగం జనవరి 2న ఏర్పడబోతోంది. ఇదే గజకేసరి రాజయోగం. ఇది కొన్ని రాశులకు కలిసి వస్తుంది. 

PREV
14
గజకేసరి యోగం

దేవతల గురువు బృహస్పతి. ఇతడినే గురు గ్రహం అని పిలుస్తారు. గురుగ్రహం,  చంద్రుడు  కలయికతో శుభప్రదమైన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. 2026 జనవరి 2న ఏర్పడే ఈ యోగం వల్ల కొన్ని రాశులకు ఆనందం, శ్రేయస్సు, విజయం, ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆ రాశులు ఏవో ఇక్కడ ఇచ్చాము. అందులో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి.

24
వృషభ రాశి

గజకేసరి రాజయోగం ప్రభావం వృషభ రాశి వారిపై అధికంగా ఉంటుంది. ఇది వారికి మంచి జీవితాన్ని ఇస్తుంది. అప్పుగా ఇచ్చి నిలిచిపోయిన డబ్బు వారికి చేతికి తిరిగి వస్తుంది. వీరు పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు.  ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెరుగుదల వంటివి కనిపిస్తాయి.  కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

34
మిథున రాశి

మిథున రాశి వారికి కొత్త ఏడాది రెండో రోజే మంచి రోజులు మొదలవ్వబోతున్నాయి. ఈ గజకేసరి రాజయోగం వల్ల వీరికి ఉద్యోగంలో మంచి పురోగతి ఉంటుంది. వీరికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో, వ్యాపారంలో కూడా కొత్త బాధ్యతలు పెరుగుతాయి. ఇక వీరి జీవితంలో విజయం, గౌరవం పెరుగుతాయి. పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయి.

44
తులా రాశి

తులా రాశి వారు గజకేసరి యోగం వల్ల ఎంతో లాభపడతారు. ఇక రాశిలో వ్యాపారాలు చేస్తున్నవారు లాభాలు పొందుతారు. గజకేసరి రాజయోగం వల్ల ఒక ముఖ్యమైన ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. అలాగే వీరికి ఆర్థిక లాభాలు కలుగుతాయి. వీరి వైవాహిక జీవితం అద్భుతంగా బాగుంటుంది. ఈ రాశివారు గట్టిగా ప్రయత్నిస్తే విదేశీ ప్రయాణం సాధ్యమవుతుంది. ఇక వీరి కెరీర్‌లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి..

Read more Photos on
click me!

Recommended Stories