Moon Transit: పరమ ఏకాదశి నుంచి చంద్రుడి వల్ల ఈ 4 రాశుల వారి జీవితమే మారిపోతుంది..ఆకస్మిక ధనలాభం

Published : Jun 11, 2026, 07:17 AM IST

Moon Transit: పరమ ఏకాదశి జూన్ 11న. ఈ రోజు చంద్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని వల్ల నాలుగు రాశుల వారికి విపరీత ప్రయోజనాలు ఉంటాయి. వారికి మానసిక ప్రశాంతతతో పాటూ ధనలాభాలు కలుగుతాయి. ఆ రాశులేవో తెలుసుకోండి. 

PREV
14
మేష రాశి

మేషరాశిలోకే చంద్రుడు ప్రవేశించాడు. కాబట్టి ఈ రాశి వారికి భారీగా ప్రయోజనాలు కలుగుతాయి. ఏదైనా ముఖ్యమైన ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకు ఖాతాలో డబ్బు పెరుగుదల కనిపిస్తుంది. అలాగే మేష రాశి వారిలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక లాభాలు కలుగుతాయి.

24
మిథున రాశి

చంద్రుని సంచారం మిథున రాశి వారికి విజయాన్ని తెచ్చే మార్గాలను తెరుస్తుంది.ఇక వ్యాపారస్తులకు లాభాలు ఆర్జించేందుకు ఇదే మంచి సమయం. ఉద్యోగం చేస్తున్నవారికి ప్రమోషన్ రావచ్చు. లేదా జీతం పెరగవచ్చు. తీసుకున్న అప్పులు తిరిగి చెల్లిస్తారు. కుటుంబం గౌరవం పెరుగుతుంది. వీరు చెప్పేది చుట్టుపక్కల ఉన్న వారు వినేందుకు ఇష్టపడతారు.

34
సింహ రాశి

చంద్ర సంచారం సింహరాశి వారికి ఎంతో పురోగతిని అందిస్తుంది. వీరికి జీతం పెంపు లేదా ప్రమోషన్ వంటి శుభవార్తలు అందే అవకాశం ఉంది. వ్యాపారం చేస్తున్నవారికి పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. వీరికి భారీగా ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారి తల్లి ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. వీరి చాలా ప్రశాంతంగా ఉంటుంది.

44
ధనుస్సు రాశి

కుజ గ్రహ సంచారం, చంద్ర సంచారం వల్ల ధనుస్సు రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి.వీరికి కొత్త పరిచయాలు ఏర్పడి ఆర్థిక లాభాలు తెచ్చి పెడతాయి. ముఖ్యమైన వ్యాపార ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం ఉంది.ముఖ్యమైన నిర్ణయాలను ఆత్మ విశ్వాసంతో తీసుకుంటారు.

Read more Photos on
click me!

Recommended Stories