Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు బంధుమిత్రుల నుంచి విలువైన బహుమతులు పొందుతారు!

Published : Jun 11, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 11.06.2026 గురువారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ఆప్తుల నుంచి అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి. దీర్ఘకాలిక అప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. సంఘంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.

313
వృషభ రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాలలో ఆత్మ విశ్వాసంతో పని చేసి లాభాలు అందుకుంటారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. దాయాదులతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి ఆశించిన సహకారం అందుతుంది. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.

413
మిథున రాశి ఫలాలు

రుణ ఒత్తిడి అధికమవుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. సంతానం విషయంలో ఊహించని విషయాలు తెలుస్తాయి. స్థిరాస్తి ఒప్పందాలు కష్టం మీద పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

513
కర్కాటక రాశి ఫలాలు

మిత్రులకు మీ అభిప్రాయాలు నచ్చవు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేయలేరు. కుటుంబ పెద్దలతో మాటపట్టింపులుంటాయి. ఇంటా బయటా ఒత్తిడి వల్ల శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాల్లో అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

613
సింహ రాశి ఫలాలు

బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో అందరితో సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. వాహన అనుకూలత కలుగుతుంది. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

713
కన్య రాశి ఫలాలు

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. బంధు మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రవర్తనకు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.

813
తుల రాశి ఫలాలు

చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. శారీరక, మానసిక సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో విలువైన పత్రాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారాలలో సొంత నిర్ణయాలు కలిసిరావు. కుటుంబ విషయంలో ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. దైవ కార్యక్రమంలో పాల్గొనడం మంచిది.

913
వృశ్చిక రాశి ఫలాలు

నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. అవసరానికి చేతిలో డబ్బు ఉండదు. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు

కీలక వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సోదరుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.

1113
మకర రాశి ఫలాలు

అనవసర వస్తువులపై డబ్బు ఖర్చు చేస్తారు. సమయానికి నిద్రాహారాలు ఉండవు. కంటి సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది. ఇతరుల నుంచి విమర్శలు ఎదురవుతాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆప్తులతో మాట పట్టింపులు కలుగుతాయి.

1213
కుంభ రాశి ఫలాలు

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రుల నుంచి విలువైన బహుమతులు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విందు వినోదాది కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి.

1313
మీన రాశి ఫలాలు

ఇంటా బయటా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు తప్పవు. ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో మార్పులుంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories