మీన రాశి వారికి చంద్రుడు సరైన దిశలో ఉంటే వారిలో ఊహాశక్తి, ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతాయి. గురు, చంద్రులు కలిసి 1, 4, 5, 9, 10వ స్థానాల్లో ఉంటే ఈ రాశి వారి బాగా కలిసివస్తుంది. వీరిలో సృజనాత్మకత, విద్య, ఆన్‌లైన్ వ్యాపారం, స్టార్టప్‌ల ద్వారా ఆకస్మిక ధనలాభం విపరీతంగా కలిగే అవకాశం ఉంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఇది వారి జీవితాన్ని మార్చేసే యోగం.