Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు!

Published : Apr 27, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 27.04.2026 సోమవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు ఆలోచనలు మంచివి కావు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.

313
వృషభ రాశి ఫలాలు

నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. బంధు మిత్రుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి.

413
మిథున రాశి ఫలాలు

దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఉద్యోగ వాతావరణం గంధరగోళంగా ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి.

513
కర్కాటక రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. బంధు మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా సాగుతుంది.

613
సింహ రాశి ఫలాలు

ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. గృహ నిర్మాణ వ్యవహారాలలో తొందరపాటు మంచిది కాదు. ఇంటా బయటా అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. ఉద్యోగులు అదనపు బాధ్యతల వల్ల పనులు సకాలంలో పూర్తి చేయలేరు.

713
కన్య రాశి ఫలాలు

ఆప్తులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

813
తుల రాశి ఫలాలు

ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి ఆశించిన లాభాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు

అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం దక్కదు. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

1013
ధనుస్సు రాశి ఫలాలు

బంధువుల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. వ్యాపారాలలో ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులకు చివరి నిమిషంలో అవకాశాలు చేజారుతాయి. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వృత్తి, వ్యాపారాలలో సొంత నిర్ణయాలు కలిసిరావు. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలుంటాయి.

1113
మకర రాశి ఫలాలు

ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. సంఘంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలు ఆరంభించి సకాలంలో పూర్తిచేస్తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుమణుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు.

1213
కుంభ రాశి ఫలాలు

చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆప్తుల నుంచి అందిన ఆహ్వానాలు కొంత ఉత్సాహాన్నిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి సన్నిహితుల సాయం అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలు అనుకూలం.

1313
మీన రాశి ఫలాలు

దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఊహించని సమస్యలు వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఇంటా బయటా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories