స్వప్న శాస్త్రం ప్రకారం.. కలలో పూలు కనిపించడం సాధారణంగా శుభ సూచికంగా భావిస్తారు. పూలు సౌందర్యం, పవిత్రత, ప్రేమ, ఆనందానికి ప్రతీకలు. కలలో తాజా పూలు కనిపిస్తే అది మన జీవితంలో శుభవార్తలు, సంతోషకరమైన మార్పులు, కొత్త అవకాశాలు రాబోతున్నాయనే సంకేతం. ముఖ్యంగా తెల్ల పూలు కనిపిస్తే మనస్సుకు శాంతి, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది.
ఎర్ర పూలు ప్రేమ, ఆకర్షణ, దాంపత్య జీవితంలో ఆనందాన్ని సూచిస్తే, పసుపు పూలు జ్ఞానం, విద్య, గౌరవాన్ని సూచిస్తాయి. అయితే కలలో వాడిపోయిన లేదా రాలిపోయిన పూలు కనిపిస్తే అది నిరాశ, అవకాశాలు చేజారిపోవడం లేదా భావోద్వేగ గందరగోళానికి సూచన అని స్వప్న శాస్త్రం చెబుతోంది.