Dream Meaning: కలలో Ex లవర్ కనిపిస్తే అర్థం ఏంటి? మనసు ఇంకా వారినే కోరుకుంటున్నట్లా?

Published : Jun 13, 2026, 02:14 PM IST

Dream Meaning: ప్రతి ఒక్కరికీ కలలు వస్తుంటాయి. కొన్ని కలలు మనసులో నిలిచిపోతాయి. ముఖ్యంగా గతంలో ప్రేమించిన వ్యక్తి కలలో కనిపిస్తే ఎందుకు ఈ కల వచ్చిందని చాలామంది ఆలోచిస్తుంటారు. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో Ex లవర్ కనిపించడం వెనుక అర్థం ఏంటో చూద్దాం. 

PREV
16
కలలో Ex లవర్ కనిపిస్తే అర్థం ఏంటి?

మనిషి జీవితంలో కలలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. కొన్ని కలలు మనకు సంతోషాన్నిస్తే, మరికొన్ని కలలు ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ముఖ్యంగా గతంలో మనం ప్రేమించిన వ్యక్తి కలలో కనిపిస్తే చాలామంది అయోమయానికి గురవుతారు. ఇంకా నేను ఆ వ్యక్తిని మర్చిపోలేదా? అసలు ఈ కలకు ఎందుకు వచ్చింది? దీని అర్థం ఏంటని ఆలోచిస్తుంటారు. స్వప్న శాస్త్రం, జ్యోతిష్య పండితుల ప్రకారం ఈ కలకు అర్థం ఏంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

26
గతాన్ని గుర్తు చేసే ప్రక్రియ

స్వప్న శాస్త్రం ప్రకారం కలలు మన మనసులో దాగి ఉన్న భావోద్వేగాలకు ప్రతిబింబం. ఒకప్పుడు మన జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తి గురించి మనసులో మిగిలిపోయిన జ్ఞాపకాలు, అనుభూతులు, భావాలు కలల రూపంలో బయటపడవచ్చు. కాబట్టి Ex లవర్ కలలో కనిపించడం అంటే మళ్లీ ఆ వ్యక్తితో సంబంధం ఏర్పడబోతుందని అర్థం కాదు. చాలా సందర్భాల్లో అది గతాన్ని గుర్తు చేసే మానసిక ప్రక్రియ మాత్రమే.

36
కలలో Ex లవర్ కలలో సంతోషంగా కనిపిస్తే?

పండితుల ప్రకారం Ex లవర్ కలలో సంతోషంగా కనిపిస్తే, అది మీ జీవితంలో ఒక దశ ముగిసి కొత్త ప్రారంభానికి మీరు సిద్ధంగా ఉన్నారని సూచన. గతంలో జరిగిన సంఘటనలను మీరు అంగీకరించి ముందుకు సాగుతున్నారని ఈ కల సంకేతం. అలాగే ఆ వ్యక్తితో నవ్వుతూ మాట్లాడుతున్నట్లు కల వస్తే, మీ మనసులో ఇంకా కొన్ని తీయని జ్ఞాపకాలు మిగిలి ఉన్నాయని అర్థం.

46
గొడవ పడుతున్నట్లు కనిపిస్తే?

కలలో Ex లవర్‌తో గొడవ పడుతున్నట్లు లేదా బాధాకరమైన పరిస్థితులు కనిపిస్తే, అది ఇంకా పరిష్కారం కాని భావోద్వేగాలను సూచించవచ్చు. గతంలో జరిగిన సంఘటనల వల్ల కలిగిన బాధ, కోపం లేదా నిరాశ పూర్తిగా తొలగిపోలేదని అర్థం. ఇలాంటి కలలు వచ్చినప్పుడు గతాన్ని పదే పదే గుర్తు చేసుకోవడం కంటే, మనసుకు ప్రశాంతత కలిగించే పనులపై దృష్టి పెట్టడం మంచిది.

56
పిలుస్తున్నట్లు కల వస్తే?

కలలో Ex లవర్ మిమ్మల్ని పిలుస్తున్నట్లు లేదా తిరిగి రావాలని కోరుతున్నట్లు కనిపిస్తే, అది మీ జీవితంలో ఏదో ఒక విషయం పట్ల మీరు ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదనే సంకేతం కావచ్చు. కొన్నిసార్లు ప్రేమ సంబంధం కాకుండా, ఆ సంబంధం ద్వారా నేర్చుకున్న పాఠాలు లేదా అనుభవాలు మీకు గుర్తుకు వస్తున్నాయని కూడా అర్థం చేసుకోవచ్చు.

66
చనిపోయిన వ్యక్తి కలలో కనిపిస్తే?

మరణించిన Ex లవర్ కలలో కనిపిస్తే లేదా ఆ వ్యక్తి ఏడుస్తున్నట్లు కనిపిస్తే చాలామంది భయపడుతుంటారు. కానీ ఇవి సాధారణంగా మనసులో ఉన్న భావోద్వేగ ఒత్తిడి లేదా గత జ్ఞాపకాల ప్రభావం వల్ల వచ్చే కలలుగా పరిగణిస్తారు. జ్యోతిష్య నిపుణుల ప్రకారం చంద్రుని ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో కూడా పాత జ్ఞాపకాలు కలల రూపంలో కనిపించే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా పౌర్ణమి లేదా అమావాస్య సమయాల్లో భావోద్వేగాలకు సంబంధించిన కలలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories