1.మేష రాశి...
ఈ ఏడాది మేష రాశివారు ఏలినాటి శని దశ మొదటి దశ ప్రభావాన్ని చూస్తారు. అందువల్ల, మేష రాశి వారు కెరీర్, వ్యాపారం, ఆర్థిక విషయాలకు సంబంధించి అనేక సవాళ్లు ఎదుర్కుంటారు. ఈ కాలంలో మీరు అద్భుతమైన అవకాశాలను కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా, శని ప్రభావం వల్ల మేష రాశివారు అపార్థాల కారణంగా సంబంధాలలో అడ్డంకులు, మనస్పర్థలను ఎదుర్కోవలసిరావచ్చు. మీరు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఈ సమస్యను తగ్గించుకోవడానికి మేష రాశివారు శని ఆలయానికి వెళ్లి ఆవాల నూనెలో నల్ల నువ్వులు కలిపి శని దేవునికి సమర్పించి..ఆలయంలో దీపం వెలిగించాలి. తర్వాత 'ఓం ప్రం ప్రిం ప్రౌం సహ శనైశ్చరాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి. దీని తర్వాత, మేష రాశి వారు నల్ల నువ్వులు, ఆవాల నూనె లేదా మినపప్పును దానం చేయాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.