హిందూ మతంలో తులసి మొక్కను చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ మొక్క లక్ష్మీ దేవికి ప్రతీక మాత్రమే కాదు, పాజిటివ్ ఎనర్జీకి మారుపేరు.దాదాపు ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో తులసి మొక్కను పెంచుతూ ఉంటారు. తులసి మాత ఎక్కడ ఉంటుందో.. అక్కడ విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. తులసి లేకుండా.. ఏ మతపరమైన కార్యక్రమం అసంపూర్ణంగా పరిగణిస్తారు.
వాస్తు శాస్త్రం ప్రకారం, ప్రతి ఉదయం, సాయంత్రం తులసి మొక్క ఎదురుగా దీపం వెలిగించడం, నీటిని సమర్పించడం, ప్రదక్షిణ చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. అయితే.. చాలా మంది పొరపాటున తులసి మొక్క దగ్గరలో ఇతర మొక్కలను కూడా నాటుతూ ఉంటారు. దీని వల్ల ఆ మొక్క పవిత్రత తగ్గుతుంది. మరి, వాస్తు శాస్త్రం ప్రకారం ఎలాంటి మొక్కలను తులసి మొక్కకు దూరంగా ఉంచాలో తెలుసా? వేటి కారణంగా ఇంట్లో సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం...