నేడు ఈ రాశివారు విలువైన వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి!

Published : Sep 08, 2025, 05:00 AM IST

ఈ రాశి ఫలాలు 8.09.2025 సోమవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

చేపట్టిన పనులు అతి కష్టం మీద పూర్తవుతాయి. స్థిరాస్తి వ్యవహారాలలో పెద్దలతో ఆలోచించి మాట్లాడాలి. వృత్తి, వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి వ్యతిరేకత పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.

313
వృషభ రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాలలో సోదరుల సహాయంతో ముందుకు సాగుతారు. రావాల్సిన సొమ్ము అవసరానికి అందుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంటి వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

413
మిథున రాశి ఫలాలు

కంటి సంబంధిత సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. నిరుద్యోగులు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి.

513
కర్కాటక రాశి ఫలాలు

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకున్న పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తిచేస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

613
సింహ రాశి ఫలాలు

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాల్లో కొన్ని సమస్యలు చికాకు తెప్పిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చు పెరుగుతుంది. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

713
కన్య రాశి ఫలాలు

ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. సంతాన ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం దక్కుతుంది.  

813
తుల రాశి ఫలాలు

శ్రమకు తగిన ఫలితం ఉండదు. వృత్తి, వ్యాపారాలలో సొంత ఆలోచనలు చేయడం మంచిది. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఇతరుల ప్రవర్తన వల్ల మానసిక అశాంతి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.

1013
ధనుస్సు రాశి ఫలాలు

దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. పిల్లల వ్యవహారాలు సమస్యాత్మకంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. విద్యార్థులు మరింత కష్టపడాల్సి వస్తుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు విసుగు తెప్పిస్తాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం.

1113
మకర రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. పిల్లల చదువు విషయాలు సానుకూల ఫలితాలిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడుతాయి. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు.

1213
కుంభ రాశి ఫలాలు

ఆర్థికంగా అనుకూలం. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. బంధు మిత్రులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాలలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.

1313
మీన రాశి ఫలాలు

మంచి ఆలోచన, జ్ఞానంతో ముందుకు సాగుతారు. నూతన వస్తు వాహనం కొనుగోలు చేస్తారు దూరప్రాంతాల బందువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పిల్లల చదువు, ఉద్యోగం విషయంలో శుభవార్తలు వింటారు.

Read more Photos on
click me!

Recommended Stories