Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు!

Published : Feb 08, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 08.02.2026 ఆదివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

313
వృషభ రాశి ఫలాలు

ఆప్తుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది.

413
మిథున రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాల్లో ఆశించిన విజయం సాధిస్తారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట పొందుతారు. వృత్తి, ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది.

513
కర్కాటక రాశి ఫలాలు

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలు వస్తాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మాటలు కొంత బాధ కలిగిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.

613
సింహ రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి.

713
కన్య రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. మిత్రులతో వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితుల నుంచి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. ఇంటి వాతావరణం సందడిగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు.

813
తుల రాశి ఫలాలు

చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆధ్యాత్మిక చింతన వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు.

913
వృశ్చిక రాశి ఫలాలు

ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి, వ్యాపారాలలో శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

1013
ధనుస్సు రాశి ఫలాలు

ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. సోదరుల నుంచి స్థిరాస్తి లాభం పొందుతారు దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ శ్రమకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది.

1113
మకర రాశి ఫలాలు

వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చడం మంచిది కాదు. వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.

1213
కుంభ రాశి ఫలాలు

అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. చేపట్టిన పనుల్లో శ్రమ కలిగినా సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలలో నూతన నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు.

1313
మీన రాశి ఫలాలు

ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. ఉద్యోగాల్లో తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తి చేస్తారు. చేపట్టిన పనులలో కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. పాత మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories