
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఇంటా బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఆశించిన ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి.
దూర ప్రయాణాల్లో ఇబ్బందులుంటాయి. ఇంటా బయట సమస్యలు చికాకు తెప్పిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు సాదాసీదాగా నడుస్తాయి. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు.
చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. నూతన వాహన యోగం ఉంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.
సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ఆర్థిక లాభాలు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.
కీలక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ఉద్యోగులకు సమస్యలు తప్పవు. బంధు వర్గంతో విభేదాలు కలుగుతాయి.
వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. స్థిరాస్తి ఒప్పందాల్లో ఆటంకాలు తప్పవు. చేపట్టిన పనులు మధ్యలో ఆగిపోతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. ఉద్యోగులకు తోటివారితో మాటపట్టింపులు కలుగుతాయి.
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. భూ వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి.
వివాదాలకు సంబంధించి సంఘంలో పెద్దల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. ఉద్యోగులకు శాలరీ విషయంలో సానుకూల ఫలితాలుంటాయి.
ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులు మరింత కష్టపడాలి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలించవు.
డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చవు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో తొందరపాటు మంచిది కాదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సన్నిహితుల నుంచి కీలక విషయాలు తెలుసుకుంటారు. పిల్లల చదువుకు సంబంధించి శుభవార్తలు వింటారు. కొత్త వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగంలో సమస్యలు తొలగుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.
ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. కొత్త కార్యక్రమాల ప్రారంభానికి ఆటంకాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాల్లో భాగస్వాములతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.