Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కీలక విషయాల్లో సొంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది!

Published : Oct 05, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 05.10.2026 సోమవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాటపడతాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. దూర ప్రాంతాల బంధువుల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

313
వృషభ రాశి ఫలాలు

బంధువులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన విధంగా రాణించి విశేషమైన లాభాలు పొందుతారు. కీలక విషయాల్లో సొంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది.

413
మిథున రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాలలో సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

513
కర్కాటక రాశి ఫలాలు

ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో ఏర్పడిన అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు.

613
సింహ రాశి ఫలాలు

నిరుద్యోగుల ప్రయత్నాలు చాలా కష్టం మీద ఫలిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు.

713
కన్య రాశి ఫలాలు

వృత్తి, ఉద్యోగాలు అనుకూలం. సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మిత్రులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగిపోతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది.

813
తుల రాశి ఫలాలు

ఉద్యోగాలలో ఏర్పడిన చికాకులు అధికారుల సహాయంతో రాజీ చేసుకుంటారు. గృహ నిర్మాణ విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.

913
వృశ్చిక రాశి ఫలాలు

భూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తొలగుతాయి. బంధువుల నుంచి అవసరానికి డబ్బు సహాయం అందుతుంది. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు ఫలిస్తాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు

ఉద్యోగులకు శాలరీ విషయంలో శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.

1113
మకర రాశి ఫలాలు

ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు.

1213
కుంభ రాశి ఫలాలు

నూతన వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. రుణదాతల నుంచి ఒత్తిడి తొలగుతుంది. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు.

1313
మీన రాశి ఫలాలు

ఉద్యోగాలలో ఎదురైన సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories