Rahu Influence: వామ్మో... ఈ ఐదు నెలలు రాహు కారణంగా 3 రాశులకు ఊహించని చిక్కులు

Published : Jul 04, 2026, 08:07 AM IST

 Rahu Influence: రాహువు ప్రస్తుతం కుంభ రాశిలో ఉన్నాడు.ఈ ఏడాది డిసెంబర్ వరకు ఇదే రాశిలో ఉంటాడు. దీని కారణంగా మూడు రాశులకు ఊహించని సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు రానున్నాయి. రాహు ప్రభావంతో ఇబ్బంది పడే రాశులు ఇవే... 

PREV
13
మేష రాశి..

రాహు ప్రభావం మేష రాశివారికి అనుకోని సమస్యలు, సవాళ్లను తీసుకురానుంది. ఆర్థికంగా ఊహించని సమస్యలు రానున్నాయి. ఈ 5 నెలల సమయంలో.. ఎలాంటి పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ఎందుకంటే... పెట్టుబడులు పెట్టినా.. ఆర్థికంగా బాగా నష్టపోయే అవకాశం ఉంది. కోపంతో తీసుకునే నిర్ణయాలతో భవిష్యత్తులో ఎదురుదెబ్బలు తగిలే అవకాశం ఉంది. ఉద్యోగం చేసే వారు పని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పొరపాటు చేసినా... భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.

23
కర్కాటక రాశి..

కుంభ రాశిలో రాహు సంచారం.. కర్కాటక రాశివారికి కూడా ఊహించని సమస్యలు తీసుకురానుంది. ముఖ్యంగా ఈ ఏడాది చివరి వరకు వీరికి ఏదో ఒక రూపంలో సమస్యలు వస్తూనే ఉంటాయి. పరిస్థితులు ఏ మాత్రం మీకు అనుకూలంగా ఉండవు. తెలిసీ తెలియక చేసే తప్పుల కారణంగా ఇబ్బందులు ఎదురౌతాయి. భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్థలు వస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యుల సపోర్ట్ తో ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది.

33
కుంభ రాశి..

ప్రస్తుతం రాహు కుంభ రాశిలోనే ఉన్నాడు. డిసెంబర్ వరకు ఇదే రాశిలో ఉంటాడు. అందుకే.. ఈ రాశివారికి అనుకోని ఇబ్బందులు, సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇతరులు అనే మాటలు మానసికంగా చాలా ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి.ఈ సమయంలో ఈ రాశివారు వీలైనంత వరకు సహనంగా ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నవారికి తోటి ఉద్యోగులు ఇబ్బందులు, ఆటంకాలు సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి.. జాగ్రత్తగా ఉండాలి.

Read more Photos on
click me!

Recommended Stories