
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
ఆదాయ వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
బంధు మిత్రులతో అకారణంగా మాటపట్టింపులు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబసభ్యులు మీ మాటతో విభేదిస్తారు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం కలుగుతుంది. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం మంచిదికాదు.
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. ఇంటా బయటా చికాకులు తప్పవు. మానసిక ప్రశాంతతకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. వ్యాపార, ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.
దూరపు బంధువుల రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. బంధు మిత్రులతో పాత విషయాల గురించి చర్చిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత లాభసాటిగా సాగుతాయి.
కొత్త పరిచయాలు విస్తృతమవుతాయి. వివాహాది శుభకార్యాలకు కుటుంబ సభ్యులతో హాజరవుతారు. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. సన్నిహితులతో వివాదాలు సర్దుమణుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది. పిల్లల చదువు విషయాల్లో శుభవార్తలు వింటారు.
కుటుంబ సభ్యులతో కొన్ని వ్యవహారాలలో వివాదాలు తప్పవు. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. శ్రమతో కానీ పనులు పూర్తికావు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఉద్యోగాల్లో అధికారులతో చర్చలు ఫలించవు.
అవసరానికి చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. దూరప్రాంత మిత్రుల నుంచి అందిన సమాచారం మానసిక బాధను కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మొండి బకాయిలు వసూలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృథా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. వ్యాపార భాగస్వామితో వివాదాలు కలుగుతాయి. పిల్లల చదువుపై దృష్టి సారించడం మంచిది.
నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. బంధువర్గం నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అవరోధాలను అధిగమించి పదోన్నతులు పొందుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఆర్థికంగా పురోగతి ఉంటుంది.
ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు పనికిరాదు. రుణ ప్రయత్నాలు కలిసిరావు. చేపట్టిన పనులలో ఎంత కష్టపడినా ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఇతరుల నుంచి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.