నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. అనుకూల ఫలితాలు!

Published : Nov 04, 2025, 05:00 AM IST

Today Rasi Phalalu:ఈ రాశి ఫలాలు 4.11.2025 మంగళవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు వస్తాయి. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

313
వృషభ రాశి ఫలాలు

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభ సూచలు ఉన్నాయి.

413
మిథున రాశి ఫలాలు

ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. చేపట్టిన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి, ఉద్యోగాలు సమస్యాత్మకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు వస్తాయి.

513
కర్కాటక రాశి ఫలాలు

సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు లాభదాయకం. ఉద్యోగాలలో ఒత్తిడి తొలగుతుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

613
సింహ రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని విషయాలలో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

713
కన్య రాశి ఫలాలు

ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. దైవచింతన పెరుగుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు తప్పవు.

813
తుల రాశి ఫలాలు

ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం ఉండదు. బంధుమిత్రులతో మాటపట్టింపులు తప్పవు.

913
వృశ్చిక రాశి ఫలాలు

ఆస్తి వివాదాలు తొలగుతాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కీలక సమయంలో ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు

ప్రముఖులతో సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. సన్నిహితుల నుంచి అవసరానికి డబ్బు అందుతుంది. ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు సంతోషాన్నిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు.

1113
మకర రాశి ఫలాలు

చిన్నపాటి అనారోగ్య సమస్యలు తప్పవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

1213
కుంభ రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు కొన్ని మధ్యలో ఆగిపోతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి.

1313
మీన రాశి ఫలాలు

ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడటానికి ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories