Today Rasi Phalalu: నేడు ఈ రాశులవారికి విపరీతంగా కలిసివస్తుంది.. అన్నీ అనుకూలమే!

Published : Aug 04, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 04.08.2026 మంగళవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. సంతాన విద్యా ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

313
వృషభ రాశి ఫలాలు

చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. రుణ దాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి. ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

413
మిథున రాశి ఫలాలు

కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక వృద్ధి కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

513
కర్కాటక రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు. చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

613
సింహ రాశి ఫలాలు

ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. మిత్రుల నుంచి అవసరానికి డబ్బు సహాయం అందుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకు కలిగిస్తాయి.

713
కన్య రాశి ఫలాలు

చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయటా పని ఒత్తిడి వల్ల తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాల అప్రమత్తంగా వ్యవహరించాలి.

813
తుల రాశి ఫలాలు

బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.

913
వృశ్చిక రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులు అదనపు బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు.

1013
ధనుస్సు రాశి ఫలాలు

నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. కుటుంబ పెద్దల ఆదరణ పెరుగుతుంది. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

1113
మకర రాశి ఫలాలు

ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఇంటా బయటా ఒత్తిడి వల్ల మానసిక సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు తప్పవు.

1213
కుంభ రాశి ఫలాలు

దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా అనుకూలం. నూతన వస్తు, వస్త్ర లాభాలు పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులు శాలరీ విషయంలో శుభవార్తలు వింటారు.

1313
మీన రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో మీ పని తీరుకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories