Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. నిరుద్యోగులకు ఉద్యోగం!

Published : May 31, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 31.05.2026 ఆదివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ఆర్థికంగా అనుకూలం. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. కుటుంబ వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.  

313
వృషభ రాశి ఫలాలు

స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఇంటా బయటా కొంత వ్యతిరేక పరిస్థితులుంటాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. చేపట్టిన పనులు శ్రమతో పూర్తవుతాయి. ఉద్యోగాలలో అధికారుల అండదండలు పొందుతారు.

413
మిథున రాశి ఫలాలు

ఆకస్మిక ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలించవు. నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలలో శత్రు సమస్యలు ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి.

513
కర్కాటక రాశి ఫలాలు

కుటుంబ పరిస్థితులు చికాకు పరుస్తాయి. పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది. ఉద్యోగాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది.

613
సింహ రాశి ఫలాలు

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

713
కన్య రాశి ఫలాలు

అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. డబ్బు పరంగా ఒత్తిడులు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో చికాకులు తప్పవు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో స్వల్ప ఇబ్బందులుంటాయి.

813
తుల రాశి ఫలాలు

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబ విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.

913
వృశ్చిక రాశి ఫలాలు

చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. మిత్రులతో మాట పట్టింపులుంటాయి. మఖ్యమైన పనులు మధ్యలో విరమిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని పనులు తలనొప్పి తెప్పిస్తాయి. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. పాత విషయాలు గుర్తుకు వస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

1113
మకర రాశి ఫలాలు

సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఉంటుంది.

1213
కుంభ రాశి ఫలాలు

ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. ఉద్యోగాలలో చికాకులు తప్పవు.

1313
మీన రాశి ఫలాలు

ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సన్నిహితుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. వృత్తి, ఉద్యోగాలు సాధారణం.

Read more Photos on
click me!