వృత్తి, వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దైవ దర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు వస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. బంధువులతో స్థిరాస్తి వివాదాలు రావచ్చు. ఉద్యోగంలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.
212
వృషభ రాశి ఫలాలు
కొత్త వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. దూర ప్రాంత మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో విశేషంగా రాణిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. అన్ని వైపుల నుంచి ఆదాయం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది.
312
మిథున రాశి ఫలాలు
చేపట్టిన వ్యవహారాల్లో అప్రయత్నంగా విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో అవరోధాలు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలం.
ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. సోదరులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి విమర్శలు తప్పవు. నిరుద్యోగులకు కలిసిరాదు. దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది.
512
సింహ రాశి ఫలాలు
చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. వృత్తి, వ్యాపారాల్లో భాగస్వాములతో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. విద్యార్థులకు పరీక్షా ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం ఉండదు.
612
కన్య రాశి ఫలాలు
కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. విద్య, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా పురోగతి ఉంటుంది.
712
తుల రాశి ఫలాలు
ముఖ్యమైన వ్యవహారాల్లో ఆకస్మిక విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. నిరుద్యోగులకు అనుకూలం. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి.
812
వృశ్చిక రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. డబ్బు విషయాల్లో తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి, వ్యాపారాల్లో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.
912
ధనుస్సు రాశి ఫలాలు
ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. అకారణంగా సన్నిహితులతో వివాదాలు వస్తాయి. కీలక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసిరావు. కుటుంబంలో కొందరి మాటలు చిరాకు తెప్పిస్తాయి. నిరుద్యోగులకు పెద్దగా కలిసిరాదు. ఉద్యోగంలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
1012
మకర రాశి ఫలాలు
బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వాహన, భూ లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు.
1112
కుంభ రాశి ఫలాలు
కుటుంబ సభ్యులతో ఊహించని గొడవలు వస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
1212
మీన రాశి ఫలాలు
స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. సమాజంలో పెద్దల నుంచి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. చుట్టుపక్కల వారితో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాల్లో సమస్యలు తొలగిపోతాయి.