నేడు ఈ రాశివారి జీవితంలో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి!

Published : Sep 28, 2025, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 28.09.2025 ఆదివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

చేపట్టిన పనులు సాఫీగా సాగుతాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొన్ని విషయాలలో బంధు మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

313
వృషభ రాశి ఫలాలు

సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.

413
మిథున రాశి ఫలాలు

ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడుతాయి. వాహన యోగం ఉంది. పనులలో అవాంతరాలు అధిగమిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

513
కర్కాటక రాశి ఫలాలు

ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. దూరపు బంధువుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.

613
సింహ రాశి ఫలాలు

ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇంటా బయటా సమస్యలు బాధిస్తాయి. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. చేపట్టిన పనులు మధ్యలో వదిలేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు అంతంతమాత్రంగా ఉంటాయి.

713
కన్య రాశి ఫలాలు

చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు.

813
తుల రాశి ఫలాలు

చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగులు కష్టపడ్డా ఫలితం దక్కదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకులు కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త సమస్యలు ఎదురవుతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు

ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక వ్యవహారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పని చేసి అధికారుల అనుగ్రహం పొందుతారు.

1013
ధనుస్సు రాశి ఫలాలు

కీలక వ్యవహారాలు మందగిస్తాయి. ఇంటా బయటా ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. సోదరులతో అకారణంగా వివాదాలు రావచ్చు. ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

1113
మకర రాశి ఫలాలు

అనుకున్న పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. కొత్త వ్యాపార ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ప్రభుత్వ అధికారులతో చర్చలు సఫలమవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి.

1213
కుంభ రాశి ఫలాలు

నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. పిల్లల చదువు విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి.

1313
మీన రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు చోటుచేసుకుంటాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories