Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి పనుల్లో ఆటంకాలు, ఆస్తి వివాదాలు, మిత్రుల వల్ల సమస్యలు!

Published : Jun 25, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 25.06.2026 గురువారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సంతాన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగాలలో చికాకులు తప్పవు.

313
వృషభ రాశి ఫలాలు

సోదరులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఇంటా బయటా ఒత్తిడులు పెరుగుతాయి. ముఖ్యమైన పనుల్లో శ్రమ పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగుల కష్టం వృథాగా మిగులుతుంది.

413
మిథున రాశి ఫలాలు

వాహన యోగం ఉంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో పురోగతి కలుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి.

513
కర్కాటక రాశి ఫలాలు

కుటుంబ విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు కొంత మందకొడిగా సాగుతాయి.

613
సింహ రాశి ఫలాలు

వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది.

713
కన్య రాశి ఫలాలు

ఒక వ్యవహారంలో బంధువులతో మాటలు పడాల్సి వస్తుంది. దైవ చింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో సమస్యలు చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు ముందుకు సాగవు. వృత్తి, వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

813
తుల రాశి ఫలాలు

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఆస్తి వివాదాలు వల్ల మానసిక సమస్యలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు తలనొప్పిగా మారతాయి. మిత్రుల వల్ల సమస్యలు వస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు

సన్నిహితుల నుంచి కొత్త విషయాలు తెలుస్తాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగాలలో ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు

విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. డబ్బు వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. దూరప్రాంత మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.

1113
మకర రాశి ఫలాలు

కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. పెద్దల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఉంటాయి.

1213
కుంభ రాశి ఫలాలు

ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. భూ వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. సన్నిహితుల నుంచి డబ్బు సహాయం అందుతుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

1313
మీన రాశి ఫలాలు

కుటుంబ సమస్యల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. దైవచింతన పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories