Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు కుటుంబ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదు!

Published : Oct 23, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 23.10.2026 శుక్రవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్ కు ఉపయోగపడతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

313
వృషభ రాశి ఫలాలు

నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. కొన్ని వ్యవహారాల్లో ఆప్తుల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది.

413
మిథున రాశి ఫలాలు

ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వ్యాపార విస్తరణలో అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు తప్పవు.

513
కర్కాటక రాశి ఫలాలు

వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరుల సహాయంతో ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా సాగుతుంది. కీలక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసివస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలకు హాజరవుతారు.

613
సింహ రాశి ఫలాలు

ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి. సన్నిహితుల నుంచి విమర్శలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. వివాదాలకు సంబంధించి దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది.

713
కన్య రాశి ఫలాలు

దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగు పడుతుంది ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. బంధు మిత్రులతో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

813
తుల రాశి ఫలాలు

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ మాటతో కుటుంబ సభ్యులు విభేదిస్తారు . నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి . వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు కొంత బాధిస్తాయి. అవసరానికి చేతిలో డబ్బు ఉండదు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు

కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. దూరపు బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు

మిత్రుల నుంచి రుణ ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో కొంత జాప్యం తప్పదు. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నష్టాలు ఎదుర్కొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.

1113
మకర రాశి ఫలాలు

సన్నిహితుల నుంచి అవసరానికి డబ్బు సహాయం అందుతుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది.

1213
కుంభ రాశి ఫలాలు

ఉద్యోగాలలో ఉన్నత అధికారులతో చర్చలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భూ క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

1313
మీన రాశి ఫలాలు

వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలో ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం అంతగా సహకరించదు. ఇంటా బయటా ఒత్తిడులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు.

Read more Photos on
click me!

Recommended Stories