Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది!

Published : Oct 22, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 22.10.2026 గురువారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది.

313
వృషభ రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో అవరోధాలు తప్పవు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగతాయి. ఉద్యోగాలలో మార్పులుంటాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది.

413
మిథున రాశి ఫలాలు

ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. తల్లి తరపు బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. సమాజంలో ప్రముఖులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కలహాలకు దూరంగా ఉండటం మంచిది.

513
కర్కాటక రాశి ఫలాలు

కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సోదరులతో సంతోషంగా గడుపుతారు.

613
సింహ రాశి ఫలాలు

నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. దైవ చింతన పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి.

713
కన్య రాశి ఫలాలు

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలుంటాయి. పాత అప్పులు తీర్చగలుగుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.

813
తుల రాశి ఫలాలు

సంతాన వివాహం గురించి ప్రస్తావన వస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో తోటివారి సహాయ సహకారాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. కుటుంబ వాతవరణం ప్రశాంతంగా ఉంటుంది.

913
వృశ్చిక రాశి ఫలాలు

ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

1013
ధనుస్సు రాశి ఫలాలు

బంధుమిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో విశేష లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగతుంది. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. సన్నిహితుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు కొంత అనుకూలిస్తాయి.

1113
మకర రాశి ఫలాలు

ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. ఇంటా బయటా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు.

1213
కుంభ రాశి ఫలాలు

సన్నిహితుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశించిన విధంగా సాగుతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు.

1313
మీన రాశి ఫలాలు

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలిగినా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో దైవ క్షేత్రాలు సందర్శించుకుంటారు.

Read more Photos on
click me!

Recommended Stories