పాత రుణాలు తీర్చగలుగుతారు. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. నూతన వస్తు వస్త్ర లాభాలు పొందుతారు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులు పెద్దల సహాయం పొందుతారు.