Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!

Published : Dec 21, 2025, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 21.12.2025 ఆదివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృథా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.

313
వృషభ రాశి ఫలాలు

సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగతుంది.

413
మిథున రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల కష్టం ఫలించింది నూతన అవకాశాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. సన్నిహితుల నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.

513
కర్కాటక రాశి ఫలాలు

కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కలిసిరావు. చిన్ననాటి మిత్రులతో అకారణంగా వివాదాలు ఉంటాయి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ తప్పదు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.

613
సింహ రాశి ఫలాలు

ఉద్యోగాలు ఆశించిన రీతిలో రాణించవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార వ్యవహారాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

713
కన్య రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి పదోన్నతులు పెరుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. డబ్బు వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

813
తుల రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

913
వృశ్చిక రాశి ఫలాలు

బంధు మిత్రులతో ఒక వ్యవహారంలో వివాదాలు తప్పవు. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ఇంటి వాతావరణం చికాకుగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులుంటాయి. దూరప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది.

1013
ధనుస్సు రాశి ఫలాలు

ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. వృత్తి, వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి.

1113
మకర రాశి ఫలాలు

ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగడం మంచిది. ఆత్మీయుల నుంచి అందిన శుభవార్త ఆనందం కలిగిస్తుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

1213
కుంభ రాశి ఫలాలు

ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారులతో సమస్యలు ఉంటాయి. డబ్బు వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి, వ్యాపారాలలో ఆకస్మిక నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు.

1313
మీన రాశి ఫలాలు

వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఒక వార్త ఊరట కలిగిస్తుంది. దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories