
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. బంధు మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. చేపట్టిన పనులలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి.
నూతన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సోదరుల నుంచి డబ్బు సహాయం లబిస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. దూరపు బంధువులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి.
సమాజంలో పెద్దల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికందుతుంది. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు అధిగమిస్తారు. ఆకస్మిక ధన లాభాలు పొందుతారు.
వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురవుతారు. సోదరులతో స్థిరాస్తి సంబంధిత వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. సంతానం వల్ల స్వల్ప ఇబ్బందులుంటాయి.
చేపట్టిన పనులు శ్రమతో గానీ పూర్తికావు. బంధు మిత్రులు మీ మాటలతో విభేదిస్తారు. ఇంటా బయటా పరిస్థితులు చికాకు కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.
జీవిత భాగస్వామితో దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో అంచనాలు నిజమవుతాయి. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో మనస్పర్థలు తొలగుతాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుంచి బయటపడతారు.
ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్నంగా విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. పాత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. అవసరానికి ఇతరుల నుంచి సహాయం అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.
బంధు మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త సమస్యల వల్ల చికాకు పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.
రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.
సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడుతాయి. బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో తీసుకున్న నిర్ణయాలు లాభాలనిస్తాయి. ముఖ్యమైన విషయాలలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో అధికారుల నుంచి శుభవార్తలు అందుతాయి.
ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాల్లో శ్రమ మరింత పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలు చేజారకుండా చూసుకోవాలి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.