Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు!

Published : Oct 19, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 19.10.2026 సోమవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురవుతారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు శ్రమతో పూర్తవుతాయి. స్థిరాస్తి వ్యవహారాలలో ఇబ్బందులు ఉంటాయి. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి.

313
వృషభ రాశి ఫలాలు

సోదరులతో మనస్పర్థలు తొలగుతాయి. ఇంటి వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసివస్తాయి. అవసరానికి ఇతురుల నుంచి డబ్బు సహాయం అందుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి.

413
మిథున రాశి ఫలాలు

నూతన వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు. అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గంధరగోళంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది.

513
కర్కాటక రాశి ఫలాలు

సంతాన విద్యా ఉద్యోగ విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది.

613
సింహ రాశి ఫలాలు

ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

713
కన్య రాశి ఫలాలు

సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. డబ్బు వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సంతాన శుభకార్యాల గురించి ప్రస్తావన వస్తుంది. ముఖ్యమైన పనులు బంధుమిత్రుల సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు.

813
తుల రాశి ఫలాలు

ఉద్యోగాలలో చాలాకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో సొంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది. బంధువులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

913
వృశ్చిక రాశి ఫలాలు

ఒక వ్యవహారంలో ఇతరుల ప్రవర్తన వల్ల మానసిక ప్రశాంతత ఉండదు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు విఫలమవుతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

1013
ధనుస్సు రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగులకు అతి కష్టం మీద అవకాశాలు దక్కుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కొన్ని వ్యవహారాలు సమస్యాత్మకంగా సాగుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి.

1113
మకర రాశి ఫలాలు

ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు కలసివస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

1213
కుంభ రాశి ఫలాలు

బంధు మిత్రులతో సఖ్యత పెరుగుతుంది. వ్యాపారాలలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు.

1313
మీన రాశి ఫలాలు

నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూరప్రాంత బంధు మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కీలక సమయంలో మంచి ఆలోచనా జ్ఞానంతో ముందుకు సాగుతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories