Planets Retrograde: దసరాకు నాలుగు గ్రహాల తిరోగమనం.. ఈ 4 రాశులకు విపరీతమైన అదృష్టం

Published : Oct 18, 2026, 08:35 AM IST

Planets Retrograde: దసరా వచ్చేస్తోంది. నవరాత్రుల సమయంలో ఆకాశంలో శని, శుక్రుడు, రాహువు, కేతువు తిరోగమనంలో ప్రయాణిస్తారు. దీనివల్ల 4 రాశుల వారికి భారీగా కలిసి వస్తుంది. ఆ రాశులు ఏవో తెలుసుకోండి.

PREV
14
మేష రాశి

మేష రాశి వారికి శని, శుక్రుడు, రాహువు, కేతువు గ్రహాల తిరోగమనం బాగా కలిసొస్తుంది. ఈ రాశి వారి కెరీర్‌లో దూసుకుపోతారు. ఆర్థిక కష్టాలు తీరిపోయి, డబ్బు చేతికి అందుతుంది. సమాజంలో ఈ రాశి వారికి ఒక మంచి గుర్తింపు వస్తుంది. కుటుంబం, స్నేహితుల మద్దతుతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

24
సింహ రాశి

సూర్యుడు అధిపతిగా ఉన్న సింహ రాశి వారిలో ఆత్మవిశ్వాసం అమాంతం పెరుగుతుంది. ఆఫీసులో మీ పని చూసి పై అధికారులు మెచ్చుకుంటారు. మీ కష్టంతో కొత్త గుర్తింపు తెచ్చుకుంటారు. వ్యాపారం చేసే వారికి కొత్త దారులు తెరుచుకుంటాయి. సరైన అవకాశాన్ని వాడుకుని మీరు జీవితంలో ముందుకు వెళ్తారు.

34
మిథున రాశి

మిథున రాశి వారికి ఆఫీసులో మంచి అవకాశాలు వస్తాయి. మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. మీకు కొన్ని ముఖ్యమైన బాధ్యతలు కూడా అప్పగిస్తారు. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే నష్టపోతారు.

44
తులా రాశి

తులా రాశి వారికి ఈ అరుదైన సమయం ఎంతో మేలు చేస్తుంది. ఆర్థికంగా పెద్ద లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు దక్కుతాయి. ఎప్పటినుంచో ఆగిపోయిన డబ్బు చేతికి వస్తుంది. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశం దొరుకుతుంది. సింగిల్స్‌కు పెళ్లి సంబంధాలు కుదురుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories