
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు సానుకూలంగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు.
ముఖ్యమైన పనులలో శ్రమ అధికమవుతుంది. మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.
ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇంటా బయటా సమస్యలు అధికమవుతాయి. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దూర ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్య పరంగా కొంత శ్రద్ధ వహించాలి. వృత్తి, వ్యాపారాలలో నిరాశ తప్పదు.
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్నేహితుల సహాయంతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. సంతానానికి నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.
ఆస్తి వివాదాల పరిష్కారానికి చేసే ప్రయత్నలలో చిన్నపాటి అవరోధాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాల్లో అంచనాలు అందుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. అవసరానికి డబ్బు సహాయం లభిస్తుంది.
ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు మరింత బాధిస్తాయి. నూతన రుణ యత్నాలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు మరింత చికాకు కలిగిస్తాయి. ఆస్తి వివాదాల పరిష్కారానికి చేసే ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.
ఆప్తుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. నూతన వాహన యోగం ఉంది. సన్నిహితుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. పనులు చకచక సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు.
బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన రుణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఇంటి వాతావరణం చికాకుగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.