Astrology Predictions: ఈ 6 రాశులవారికి రాజయోగం.. ఆరు నెలల వరకు డబ్బే డబ్బు!

Published : May 18, 2026, 04:32 PM IST

Astrology Predictions: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గురు, శుక్ర, బుధ, శని గ్రహాల అరుదైన కలయిక వల్ల 6 రాశులవారికి అదృష్టం పట్టనుంది. రాబోయే 6 నెలలు వీరికి తిరుగే ఉండదు. వారు పట్టిందల్లా బంగారం కానుంది. మరి ఆ రాశులేవో, వారికి ఎలా కలిసివస్తుందో చూద్దాం.

PREV
16
మేష రాశి- రెట్టింపు సంతోషం

మేష రాశి అధిపతి అయిన కుజుడు మరో ఐదు నెలల పాటు అనుకూలంగా సంచరిస్తాడు. గురు, బుధ, శుక్ర గ్రహాలు కూడా బలంగా ఉండటంతో ఈ రాశి వారి జీవితం సాఫీగా సాగిపోతుంది. వీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఆదాయం, ఉద్యోగ విషయంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తారు. గురు బలం వల్ల వీరి సంతోషం రెట్టింపు అవుతుంది. ఇంటా బయటా సంతోషకర వాతావరణం ఉంటుంది.

26
మిథున రాశి- సమస్యలు పరిష్కారం

మిథున రాశి అధిపతి బుధుడు శుభ రాశులలో సంచరిస్తున్నాడు. దీనికి తోడు గురు, శుక్ర గ్రహాల మద్ధతు కూడా లభిస్తుంది. దీంతో ఈ రాశి వారు గొప్ప విజయాలు సాధిస్తారు. వివాదాలు, విభేదాలు పరిష్కారమవుతాయి. ఒత్తిడి, సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. ఆదాయం పెరిగి, అవసరాలు తీరతాయి. బంధువులతో సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం చక్కగా సహకరిస్తుంది.

36
కర్కాటక రాశి- పట్టిందల్లా బంగారం

అదృష్టాన్నిచ్చే గురువు కర్కాటక రాశిలో ఉచ్ఛస్థితిలో సంచరిస్తున్నాడు. శుక్ర, బుధ గ్రహాల అనుకూల ప్రభావం కూడా ఉండటంతో వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది. సొంత ఇల్లు, విదేశీ ఉద్యోగం వంటి కలలు నెరవేరుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ ఆశించిన స్థాయిలో పెరుగుతుంది.

46
వృశ్చిక రాశి- కోరికలు నెరవేరడం

వృశ్చిక రాశి అధిపతి కుజుడితో పాటు శని, గురు, శుక్ర, బుధ గ్రహాలు కూడా అనుకూలంగా మారుతున్నాయి. అందువల్ల వీరి జీవితం క్రమంగా ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగం, కుటుంబ జీవితం, ఆర్థిక పరిస్థితి అన్నీ అనుకూలంగా ఉంటాయి. వీరి జీవనశైలి పూర్తిగా మారిపోతుంది.

56
మకర రాశి- పనిలో విజయం

మకర రాశికి అధిపతి అయినా శనితో పాటు గురు, శుక్ర, బుధ గ్రహాలు కూడా అనుకూలంగా సంచరిస్తున్నాయి. దీంతో ఈ రాశి వారి జీవితం పచ్చని తోటలా కళకళలాడుతుంది. వీరు చేపట్టే ఏ ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు.

66
మీన రాశి- ఆదాయం పెరుగుదల

మీన రాశివారు జూన్ నెల నుంచి శని దోషం నుంచి విముక్తి పొందుతారు. ఈ రాశి అధిపతి అయిన గురుడు ఉన్నత స్థానంలో ఉండటం వల్ల వీరి జీవితం కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, వృత్తి, వ్యాపారాల్లో అధిక లాభాలు ఉంటాయి. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మద్ధతు లభిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories