Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అన్నింట్లో ఆటంకాలే.. జాగ్రత్తగా లేకపోతే కష్టం!

Published : Sep 18, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 18.09.2026 శుక్రవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

నూతన విద్య అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. గృహ నిర్మాణ ఆటంకాలు తొలగుతాయి. ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది. ప్రయాణాలు కలసివస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.

313
వృషభ రాశి ఫలాలు

చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆప్తులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం తప్పదు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

413
మిథున రాశి ఫలాలు

దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తికావు. కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. ఉద్యోగాలలో ఎప్పటి నుంచో వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. స్వల్ప ధన ప్రాప్తి కలుగుతుంది.

513
కర్కాటక రాశి ఫలాలు

ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన ఉద్యోగ లబ్ధి కలుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

613
సింహ రాశి ఫలాలు

ఉద్యోగాలలో కొన్ని పనులు సకాలంలో పూర్తి చేసి పైఅధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. దూర ప్రాంతాల వారి నుంచి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు.

713
కన్య రాశి ఫలాలు

సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల లాభం పొందుతారు. ఆదాయం బాగుంటుంది. అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.

813
తుల రాశి ఫలాలు

వృత్తి, ఉద్యోగాలలో కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలలో నష్టాల ఊబి నుంచి బయటపడతారు. బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది.

913
వృశ్చిక రాశి ఫలాలు

అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు.

1013
ధనుస్సు రాశి ఫలాలు

వ్యాపారాలలో ఇబ్బందులు తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు.

1113
మకర రాశి ఫలాలు

ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరించడం మంచిది. అప్పుల బాధలు తొలగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయట పడతారు.

1213
కుంభ రాశి ఫలాలు

సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సోదరుల సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారం వృద్ధి చెందుతుంది.

1313
మీన రాశి ఫలాలు

ప్రయాణాలలో అవరోధాలు కలుగుతాయి. చేతిలో డబ్బు ఉండదు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో అనాలోచిత నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడతారు. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. బంధువుల నుంచి విమర్శలు ఎదురవుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories