
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
స్థిరాస్తి వివాదాలకు సంబంధించి ఆత్మీయుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. సన్నిహితుల సహాయంతో నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాల్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది.
వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారాలలో సొంత నిర్ణయాలు అంతగా కలిసిరావు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో శ్రమ అధికమవుతుంది.
దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.
ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగుల కలలు సహకారం అవుతాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.
ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటి వాతావరణం చికాకుగా ఉంటుంది. వ్యాపారాలలో కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.
మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.
ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. బంధుమిత్రుల వల్ల ఊహించని సమస్యలు వస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. పాత రుణాలు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు.
ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో ఓర్పుగా వ్యవహరించడం మంచిది.
ఇంటా బయటా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థికంగా అనుకూలం.
కొన్ని పనులు శ్రమతో కానీ పూర్తి కావు. ఇతరులతో మాట పట్టింపులు తప్పవు. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.
నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో సమస్యలు తొలగుతాయి. ఉద్యోగాలలో ప్రశాంత వాతావరణం ఉంటుంది.