Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ధన లాభ సూచనలు.. అప్పుల నుంచి ఊరట!

Published : Mar 16, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 16.03.2026 సోమవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. వాహన సంబంధిత వ్యాపారాలు లాభాలు బాట పడతాయి. వృత్తి, ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది. ఇతరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.

313
వృషభ రాశి ఫలాలు

బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు కలిగినా సమయస్ఫూర్తితో పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో నష్ట సూచనలు ఉన్నాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి.

413
మిథున రాశి ఫలాలు

ముఖ్యమైన పనులలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయ వ్యవహారాలు మరింత పుంజుకుంటాయి. వ్యాపారాలు విస్తరణకు నూతన అవకాశాలు లభిస్తాయి. మొండి బాకీలు వసూలవుతాయి. బంధు మిత్రుల ఆదరణ పొందుతారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

513
కర్కాటక రాశి ఫలాలు

నూతన పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. వృత్తి, వ్యాపారాలలో పై చేయి సాధిస్తారు. సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

613
సింహ రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. గృహ, వాహన సంబంధిత క్రయ విక్రయాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. డబ్బు వ్యవహారాలు సజావుగా సాగుతాయి.

713
కన్య రాశి ఫలాలు

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అప్పుల నుంచి ఊరట లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా చక్కగా నిర్వహిస్తారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ధన లాభ సూచనలు ఉన్నాయి.

813
తుల రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలలో చికాకులు తప్పవు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగాలలో చిన్నపాటి సమస్యలు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

913
వృశ్చిక రాశి ఫలాలు

దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సన్నిహితులతో వివాదాలు సర్దుమణుగుతాయి. ఉద్యోగ బాధ్యతలు చక్కగా నిర్వహించి అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.

1013
ధనుస్సు రాశి ఫలాలు

దూర ప్రాంత బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులలో శ్రమ పెరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పురోగతి కలుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

1113
మకర రాశి ఫలాలు

ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయ వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చేయని పనికి ఇతరుల నుంచి విమర్శలు ఎదురవుతాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం ఉండదు. నూతన వ్యాపార ప్రారంభానికి ఆటంకాలుంటాయి. ఉద్యోగులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

1213
కుంభ రాశి ఫలాలు

సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి ఊహించని బహుమతులు అందుకుంటారు. వివాహ శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. సంతానం విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

1313
మీన రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. సంతానానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు మిశ్రమంగా రాణిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక లాభాలు పొందుతారు. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories