Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. నిరుద్యోగులకు ఉద్యోగం!

Published : Dec 16, 2025, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 16.12.2025 మంగళవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. దూర ప్రయాణాలు వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉండవు.

313
వృషభ రాశి ఫలాలు

సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగుతాయి.

413
మిథున రాశి ఫలాలు

వ్యాపార, ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. జీవిత భాగస్వామితో సఖ్యతగా వ్యవహరిస్తారు. నిరుద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. సమాజంలో ప్రముఖుల నుంచి విశేషమైన ఆదరణ పొందుతారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి.

513
కర్కాటక రాశి ఫలాలు

డబ్బు వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. ముఖ్యమైన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. స్నేహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు.

613
సింహ రాశి ఫలాలు

కుటుంబ సభ్యుల నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో సొంత నిర్ణయాలు కలిసిరావు.

713
కన్య రాశి ఫలాలు

ఉద్యోగులకు అధికారుల నుంచి సమస్యలు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం గంధరగోళంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

813
తుల రాశి ఫలాలు

నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఉద్యోగులకు అధికారులతో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.

913
వృశ్చిక రాశి ఫలాలు

ఇంట్లో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు ఇతరుల నుంచి విమర్శలు తప్పవు. కుటుంబ విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. దైవ సేవా కార్యక్రమాలకు డబ్బు సహాయం అందిస్తారు.

1013
ధనుస్సు రాశి ఫలాలు

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చాలా కాలంగా పూర్తికానీ పనులు చిన్న ప్రయత్నంతో పూర్తి చేస్తారు. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు.

1113
మకర రాశి ఫలాలు

సంతానం విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలో ఊహించని మార్పులు తప్పవు. ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి.

1213
కుంభ రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన వివాహ ప్రస్తావన వస్తుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

1313
మీన రాశి ఫలాలు

చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపార భాగస్వాముల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. స్నేహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories