
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు తప్పవు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. రుణదాతల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగులకు రావాల్సిన పదోన్నతులు పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి.
ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల సలహాలు కలసివస్తాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి.
స్థిరాస్తి ఒప్పందాలలో ఆటంకాలు తప్పవు. ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల నుంచి సమస్యలు తప్పవు. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో జాగ్రత్త అవసరం.
వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. సోదరులు కొన్ని విషయాలలో మీతో విభేదిస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు నిరాశ పరుస్తాయి.
స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. దూరపు బంధువుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆకస్మిక వస్తు వాహన లాభాలు పొందుతారు. బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.
కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నూతన భూ, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
మిత్రులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. చేపట్టిన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కొంత ఒత్తిడి కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.
కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలించవు. ఇంట్లో కొందరి ప్రవర్తన భాధ కలిగిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో శ్రమ అధికమవుతుంది. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.
ఆత్మీయుల నుంచి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. సన్నిహితుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి.
వృత్తి, ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి. కొత్త రుణాలు చేస్తారు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆప్తులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.
ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో రావాల్సిన ప్రమోషన్ లు పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.