Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు చేయని పనికి నిందలు మోయాల్సి వస్తుంది!

Published : Mar 13, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 13.03.2026 శుక్రవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పుణ్య క్షేత్ర దర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్లు తప్పవు.

313
వృషభ రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలిసివస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి.

413
మిథున రాశి ఫలాలు

ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. వాహన వ్యాపారులు లాభాలు అందుకుంటారు. కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది.

513
కర్కాటక రాశి ఫలాలు

చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇంటా బయటా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

613
సింహ రాశి ఫలాలు

బంధువులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నూతన రుణాలు చేస్తారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి.

713
కన్య రాశి ఫలాలు

చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలు పెరుగుతాయి. స్నేహితుల నుంచి ధనలాభం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు.

813
తుల రాశి ఫలాలు

కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. దూర ప్రయాణాల వల్ల శారీరక శ్రమ కలుగుతుంది. బంధుమిత్రుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాట పట్టడం కష్టంగా మారుతుంది. వృత్తి, ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం దక్కదు.

913
వృశ్చిక రాశి ఫలాలు

నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలను పొందుతారు. ఇంటా బయటా ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

1013
ధనుస్సు రాశి ఫలాలు

ఉద్యోగాలలో అధికారుల నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది. సోదరులతో వివాదాలు పెరుగుతాయి. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలలో అవరోధాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.

1113
మకర రాశి ఫలాలు

విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాలలో అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. దేవాలయ దర్శనం చేసుకుంటారు.

1213
కుంభ రాశి ఫలాలు

సన్నిహితుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు. కీలక వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు తగిన గుర్తింపు లభిస్తుంది.

1313
మీన రాశి ఫలాలు

కీలక వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. చేయని పనికి సన్నిహితుల నుంచి నిందలు ఎదుర్కొంటారు. ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి. వృథా ఖర్చులు చేస్తారు. నూతన వ్యాపారాలు మందగిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories