Lucky Zodiac Signs: ఉగాది తర్వాత ఈ 3 రాశుల వారికి ఎదురులేదు.. రెట్టింపు ఆదాయం

Published : Mar 12, 2026, 04:23 PM IST

Lucky Zodiac Signs: జ్యోతిషశాస్త్రం ప్రకారం ఉగాది పండుగ తరువాత కొన్ని రాశుల వారికి బాగా కలిసివస్తుంది. కొన్ని రాశుల వారికి విజయం, సంపదకు కొత్త  మార్గాలు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు. రెండు రాజయోగాలు ఏర్పడి 3 రాశుల వారికి లక్ తెచ్చిపెడుతుంది.

PREV
14
ఉగాది రాశిఫలాలు

ఉగాది పండుగ తరువాత  కొన్ని రాశుల వారికి చాలా కలిసివస్తుంది. ఉగాది తరువాత కొన్ని గ్రహాల స్థానాలు మారుతాయి. దీనివల్ల శశ మహాపురుష యోగం, గజకేసరి యోగం ఏర్పడుతున్నాయి. ఈ రెండు శుభ యోగాలు కలిపి మూడు  రాశుల వారికి కెరీర్, వ్యాపారం, సామాజిక జీవితంలో మంచి కాలం మొదలవుతుంది. ఆ రాశుల్లో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి.

24
మేష రాశి

మేష రాశి వారికి ఉగాది తరువాత మంచి సమయం మొదలవుతుంది.  ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీంతో మేషరాశి వారు ఏ విషయంలోనైనా దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇక ఉద్యోగం మారాలనుకునే వారికి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఇక వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త పరిచయాలు పెంచుకుంటారు. ఇతరుల చేతిలో ఆగిపోయిన డబ్బు తిరిగి చేతికి  అందే అవకాశం ఉంది. వీరి కుటుంబంలో ఉన్న గొడవలు కూడా పరిష్కారమయ్యే అవకాశం ఉంది.

34
సింహ రాశి

సింహ రాశి వారికి ఎంతో కలిసొచ్చే సమయం ఇది. వీరి జీవితంలో సానుకూల మార్పులు కలుగుతాయి.   సూర్యుడి ప్రభావం వీరిపై అధికంగా ఉంటుంది.  వీరి వ్యక్తిత్వం మరింతగా  సానుకూలంగా మారుతుంది. సమాజంలో ఈ రాశి వారి గౌరవం పెరుగుతుంది. ఉద్యోగం చేస్తున్న వారికి ఆఫీసులో  ప్రశంసలు లభిస్తాయి. పై అధికారులకు ఈ రాశి వారిపై నమ్మకం పెరుగుతుంది. దీంతో ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. కుటుంబంలో ఉన్న విభేదాలు చాలా వరకు తగ్గిపోతాయి.

44
వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి  శశ, గజకేసరి యోగం సానుకూల మార్పులను తెచ్చిపెడుతుంది. కొంతకాలంగా ఈ రాశి వారిని వేధిస్తున్న సమస్యలు తగ్గుతాయి. ఈ రాశి వారు చేసే పనుల్లో ఉన్న ఆటంకాలు తొలగిపోయే అవకాశం ఉంది. వీరికి విదేశీ ప్రయాణాలు లేదా విదేశాలకు సంబంధించిన పనులకు అనుకూలమైన సమయం ఇది. ఈ రాశి వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories