ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
213
మేష రాశి ఫలాలు
ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు మానసికంగా బాధిస్తాయి.
313
వృషభ రాశి ఫలాలు
బంధువుల నుంచి విలువైన సమాచారం సేకరిస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు సహాయం అందుతుంది. ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు తొలగుతాయి. నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది.
వ్యాపారాలలో ఆకస్మిక లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. విలువైన, వస్త్ర, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు.
513
కర్కాటక రాశి ఫలాలు
ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. చేపట్టిన పనులు జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఏర్పడిన సమస్యలు సర్దుమణుగుతాయి. సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలు తీరుతాయి.
613
సింహ రాశి ఫలాలు
సోదరులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసివస్తాయి.
713
కన్య రాశి ఫలాలు
సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. ఆర్థిక సమస్యల నుంచి కొంతవరకు బయటపడతారు. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు.
813
తుల రాశి ఫలాలు
నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలు రాజీ అవుతాయి. సంఘంలో పెద్దలతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.
913
వృశ్చిక రాశి ఫలాలు
ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంఘంలో ప్రముఖుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.
1013
ధనుస్సు రాశి ఫలాలు
దూరపు బంధువులను కలుసుకుంటారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు. దూర ప్రయాణాలు కలసివస్తాయి. వ్యాపార విషయాల్లో నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
1113
మకర రాశి ఫలాలు
వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ముఖ్యమైన పనులలో తొందరపాటు పనిచేయదు. ఉద్యోగులకు పనిభారం పెరిగినా సమయానికి పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.
1213
కుంభ రాశి ఫలాలు
నూతన వ్యాపార ప్రారంభానికి ఇతరుల సహాయం అందుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూరప్రాంతాల వారి నుంచి అందిన సమాచారం కొంత ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.
1313
మీన రాశి ఫలాలు
ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు అందుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. మిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి.