Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి!

Published : Jul 10, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 10.07.2026 శుక్రవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపార భాగస్వాములతో చిన్నపాటి విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సహనంగా ఉండటం మంచిది. ఖర్చులు పెరుగుతాయి. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది.

313
వృషభ రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. పాత మిత్రుల లేదా సహోద్యోగుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు.

413
మిథున రాశి ఫలాలు

మానసిక ప్రశాంతత లభిస్తుంది. నూతన పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదు. కుటుంబంలో మీ అభిప్రాయాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. గత కొన్ని రోజులుగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

513
కర్కాటక రాశి ఫలాలు

ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు లేదా భూ గృహ వ్యవహారాలు మీకు సానుకూలంగా మారే అవకాశం ఉంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

613
సింహ రాశి ఫలాలు

ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. అనుకున్న పనులు అనుకున్నట్టు సాగక నిరాశ పెరుగుతుంది. కాస్త ఓపికగా ఉండటం మంచిది. పిల్లల ప్రవర్తన, చదువు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి.

713
కన్య రాశి ఫలాలు

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చాలా రోజులుగా ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఊరట లభిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువుల రాకతో ఇల్లు సందడిగా మారుతుంది.

813
తుల రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలలో లాభాలు బాగుంటాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. అవి భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మానసికంగా ప్రశాంత వాతావరణం ఉంటుంది.

913
వృశ్చిక రాశి ఫలాలు

శారీరక శ్రమ పెరగడం వల్ల కాస్త అలసటగా అనిపిస్తుంది. పట్టుదలతో శత్రువులపై విజయం సాధిస్తారు. పెద్దల ఆశీస్సులు, సలహాలు కలిసివస్తాయి. ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు అనుకూలం.

1013
ధనుస్సు రాశి ఫలాలు

నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. దూర ప్రాంత బంధువుల నుంచి ఒక మంచి వార్త వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు అమలు చేయడానికి మంచి రోజు.

1113
మకర రాశి ఫలాలు

ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. అనవసర వస్తువులపై డబ్బు ఖర్చు చేస్తారు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. కొన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంతో అధిగమిస్తారు. ఉద్యోగాలలో జాగ్రత్త అవసరం.

1213
కుంభ రాశి ఫలాలు

కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రయాణాలు కలిసివస్తాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.

1313
మీన రాశి ఫలాలు

చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ అవసరం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ఒక శుభవార్త వినే సూచనలు ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories