సింహ రాశి..
ఆషాఢ మాసంలో సింహ రాశివారికి పట్టిందల్లా బంగారమే. గురు,శని గ్రహాల్లో జరిగే మార్పులు సింహ రాశివారికి ఊహించని ప్రయోజనాలు తేనున్నాయి. అన్నీ శుభాలే జరుగుతాయి. శుభవార్తలు వింటారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారికి ప్రమోషన్స్, జీతం పెరుగుదల లాంటివి జరిగే అవకాశం ఉంది. మంచి పురోగతి సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఈ సమయంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టినా మంచి లాభాలు అందుకుంటారు.ఈ ఆషాడ మాసం మొత్తం మంచి విజయాలు అందుకుంటారు.